winter

చలికాలంలో ఉసిరికాయలు తింటే లాభమేంటి?

health tips

చలికాలంలో ఉసిరి కాయలు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.

ముఖ్యంగా ఉసిరికాయల్లో విటమిన్‌ సీ సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కంటే ఎక్కువ విటమిన్‌ సీ దొరుకుతుంది.

అందుకే ఈ సీజన్‌లో ఉసిరికాయలను తీసుకుంటే విటమిన్‌ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు.

ఉసిరికాయల్లో దొరికే విటమిన్‌ సీ.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా కాపాడతాయి.

శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరి తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.