చలికాలంలో వెల్లుల్లితో ఎన్ని లాభాలంటే

శీతాకాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు.

వెల్లుల్లిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌-సి, బి6, ఫోలేట్‌, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది.

వెల్లుల్లిలో యాంటీవైరల్‌ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులతో ఇవి సమర్థంగా పోరాడుతాయి.

వెల్లుల్లి ఇమ్యునోమోడ్యులేటింగ్‌ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులోని అల్లిసిన్‌ శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. గుండె, జీర్ణకోశ, శ్వాస వ్యవస్థలతో ముడిపడిన సమస్యలు వస్తుంటాయి. అదే వెల్లుల్లి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది.

తరచూ వెల్లుల్లి సూప్‌ తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది తామస, రాజస గుణాలను ప్రేరేపిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది.

శీతకాలపు అలర్జీలకు వెల్లుల్లి సత్వర పరిష్కారం.

ఈ సీజన్‌లో సీరం కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ. వెల్లుల్లిలోని పొటాషియం, మెగ్నీషియం చెడుకొలెస్ట్రాల్‌ను అడ్డుకుంటాయి.

చల్లని వాతావరణం కారణంగా శరీరంలో జీవక్రియ నెమ్మదిస్తుంది. వెల్లుల్లిలోని సహజ ఔషధ గుణాలు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.