రాత్రిపూట  పెరుగు తినొచ్చా?

పెరుగు శరీరానికి అన్ని రకాలుగానూ మంచిదే. రోజుకో గ్లాసు పాలు, కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి.

పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అరుగుదల సమస్యను నివారిస్తుంది.

ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శాకాహారులు పాలు, పెరుగు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ బీ 12 లభిస్తుంది.

పెరుగు పగలు తింటే నిద్రవస్తుంది అనేది అపోహ మాత్రమే. రాత్రి పూట తింటే మాత్రం జీర్ణక్రియ సులువవుతుంది కాబట్టి నిద్రకు ఆటంకం కలుగకుండా ఉంటుంది. పెరుగును రాత్రి, పగలు ఎప్పుడైనా తినవచ్చు.

ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. అందువల్ల రాత్రి పూట బయట ఉంచిన పెరుగు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

బాగా పులిసిన పెరుగును జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది.