Onions

అందాన్ని రెట్టింపు చేసే ఉల్లి

Beauty Tips

ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు. వంటల్లో అంతటి ప్రాధాన్యమున్న ఉల్లి ఆరోగ్యానికి మంచిది. అందానికి మరింత మంచిది. ఉల్లిరసంతో అందాన్ని రెట్టింపు చేయడమెలాగంటే..

ముఖచర్మం నల్లగా మారి పొడిబారితే ఉల్లిరసంలో శనగపిండి, మీగడ కలిపి ముఖంపై అప్లై చేయాలి.

Beauty Tips :

పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నాలుగు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది.

Beauty Tips :

చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లిరసాన్ని ముఖంపై రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. 

Beauty Tips :

ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్, విటమిన్లు, చర్మానికి సరిపడా పోషణను అందించి ఆరోగ్యాన్నిస్తాయి.

ఉల్లిరసం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వాపును తగ్గిస్తుంది. దోమలు కుట్టిన చోట, పురుగు కుట్టిన చోట ఉల్లిరసాన్ని పూస్తే త్వరిత ఉపశమనం లభిస్తుంది.

What to look for:

ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టును ఓ బుట్టలోకి తీసుకొని రసం పిండాలి.

ఈ రసాన్ని తలకు పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. 45 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి.