పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిత్యా మీన‌న్‌

#Nithyamenon

Nithya Menen

సెల‌బ్రెటీల పెండ్లిళ్ల‌పై ఎప్పుడు ఏదో ఒక వార్త రావ‌డం ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది.

Nithya Menen

తాజాగా మ‌ల‌యాళ కుట్టి నిత్యా మీన‌న్ పెండ్లి సినీ ఇండ‌స్ట్రీలో వైర‌ల్‌గా మారింది.

Nithya Menen

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో నిత్యా మీన‌న్ పెండ్లి జ‌ర‌గబోతోంద‌ని రెండు మూడు రోజుల నుంచి వార్త‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి.

Nithya Menen

కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ప‌రిచ‌య‌మైన వీళ్లిద్ద‌రూ చాలా ఏండ్లుగా ప్రేమ‌లో ఉన్నార‌ని ఆ వార్త‌ల్లో రాసుకొచ్చారు.

పెద్ద‌ల అంగీకారంతో ఇప్పుడు పెళ్లిపీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పుకార్లు వినిపించాయి.

Nithya Menen

ఈ వార్త‌లు నిత్యామీన‌న్ చెవిలో ప‌డ‌టంతో ఆ పుకార్ల‌పై ఓ మ‌ల‌యాళ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని నిత్యా మీన‌న్ క్లారిటీ ఇచ్చింది.

అస‌లు ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావ‌డం లేద‌ని అస‌హనం వ్య‌క్తం చేసింది.

ప్ర‌స్తుతం త‌న కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాన‌ని.. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచ‌నే లేద‌ని స్ప‌ష్టం చేసింది.

అలా మొద‌లైంది సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన నిత్యామీన‌న్ తెలుగు ప్రేక్ష‌కులకు చాలా ద‌గ్గ‌రైంది.

ఇటీవ‌ల భీమ్లా నాయ‌క్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన నిత్య‌.. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌తో ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా నిత్యా మీన‌న్ న‌టించిన మోడ్ర‌న్ ల‌వ్ హైద‌రాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈమె న‌టించిన 19(1)(ఎ) మ‌ల‌యాళ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో నేరుగా రిలీజ్ కాబోతోంది.

త‌మిళంలో ధ‌నుష్‌తో న‌టించిన చిరు చిత్రంబ‌ళం.. అలాగే ఆరం తిరుక‌ల్ప‌న విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.