దీంతో అమృతా అయ్యర్ సైలెంట్‌గా పెళ్లి చేసేసుకుందనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి.
పలు తమిళ వెబ్‌సైట్‌లు కూడా అమృతా అయ్యర్ పెండ్లి చేసుకుందని వార్తలు రాసుకొచ్చాయి.
ఇప్పుడు ఈ వార్తలు అమృత వరకు చేరడంతో తన పెండ్లిపై వస్తున్న వదంతులను ఖండించింది.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్‌ను పోస్టు చేస్తూ.. అవి వనక్కమ్ దా మాప్పిలై చిత్రంలోని స్టిల్స్ అని క్లారిటీ ఇచ్చింది.
అందులో ఒక సీన్‌లో పెండ్లి కూతురిగా అమృత కనిపిస్తుంది. అవే స్టిల్స్‌ను కొందరు ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు.
ఆ ఫొటోలు చూసిన పలువురు నిజంగానే అమృతకు పెండ్లి అయిపోయిందని నమ్మేశారు. కానీ ఆమె స్పందించడంతో అదంతా పుకార్లేనని స్పష్టమైంది.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమృతా అయ్యర్.
ఆ సినిమా తర్వాత తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, రెడ్, అర్జున ఫల్గుణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ చిత్రంలోనూ అమృతా అయ్యర్ నటిస్తోంది.