#Amalapaul
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్ కొట్టేసింది అమలా పాల్.
కానీ కేవలం 4 సినిమాలతోనే సరిపెట్టుకుని టాలీవుడ్‌ను వదిలేసింది అమలా పాల్.
డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాల మీదనే ఫోకస్ పెట్టింది.
తాజాగా వెబ్ సిరీస్‌లతో ఓటీటీలోనూ సత్తా చాటుతోంది అమలా పాల్.
తెలుగు సినీ పరిశ్రమ మొత్తం 4 కుటుంబాల చేతిలోనే ఉందని.. ఇండస్ట్రీలో వారి ఆధిపత్యమే కొనసాగుతోందని తెలిపింది.
వాళ్ల ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందేనని.. వారిని కేవలం గ్లామరస్‌గా చూపించడానికి మాత్రమే పరిమితం చేస్తారని పేర్కొంది.
టాలీవుడ్‌కు వచ్చిన కొత్తలోనే ఈ విషయాన్ని గమనించానని చెప్పుకొచ్చింది అమలా పాల్.