- Amala Paul

ఆ టైమ్‌లో సినిమాలు వ‌దిలేయాల‌నుకున్నా

సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి అమ‌లా పాల్‌.

White Lightning
White Lightning

కెరీర్ తొలినాళ్ల నుంచి విభిన్న పాత్ర‌లు ఎంచుకుంటూ ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

White Lightning

అయితే కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఏఎల్ విజ‌య్‌తో ల‌వ్ మ్యారేజి, ఆ వెంట‌నే డైవ‌ర్స్ అమ‌లాపాల్ కెరీర్‌ను దెబ్బ‌తీశాయి.

ఏఎల్ విజ‌య్‌తో విడాకుల అనంత‌రం డిప్రెష‌న్‌లోకి వెళ్లిన అమ‌లాపాల్‌.. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ కెరీర్ మీద ఫోక‌స్ పెట్టింది.

White Lightning

ఒక‌వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఓటీటీ వెబ్ సిరీస్‌లకూ క‌మిట్ అవుతూ త‌నేంటో నిరూపించుకుంటుంది.

తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో విడుద‌లైన క‌డ‌వ‌ర్ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమ‌లాపాల్‌.

White Lightning
White Lightning

ఇక సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏండ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమ‌లాపాల్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాన‌ని ఈ సంద‌ర్భంగా అమ‌లాపాల్ గుర్తుచేసుకుంది.

వ‌య‌సులో త‌న‌కంటే చాలా పెద్ద వారి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా న‌టించాన‌ని.. ఆ స‌మ‌యంలో చాలా ఒత్తిడి గురయ్యాన‌ని చెప్పుకొచ్చింది.

కానీ వాళ్ల నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని అమ‌లాపాల్ పేర్కొంది.

ఒకానొక సంద‌ర్భంగా లైఫ్‌లో చాలా క్లిష్ట ప‌రిస్థితులు చూశాన‌ని.. స‌క్సెస్ కోసం పాకులాడుతున్న‌ట్లు అనిపించింద‌ని తెలిపింది.

నిజానికి చాలా దూరంగా బ‌తుకుతున్న‌ట్లు ఫీల‌య్యాన‌ని.. అప్పుడు త‌న‌లో తాను ఎంతో మ‌ద‌న‌ప‌డ్డాన‌ని చెప్పింది.

ఆ టైమ్‌లో అస‌లు సినిమాల్లో ఎందుకు కొన‌సాగుతున్నాన‌నే విష‌యం అర్థం కాలేద‌ని అమ‌లాపాల్‌ తెలిపింది.

ఆక్ష‌ణ‌మే సినిమాల‌కు గుడ్ బై చెప్పాలి అనేంత‌గా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాన‌ని అమ‌లాపాల్‌ బ‌య‌ట‌పెట్టింది.

అలాంటి స‌మ‌యంలోనే నాన్న చ‌నిపోవ‌డంతో ఎన్నో భ‌యాలు వెంటాడాయ‌ని తెలిపింది.

వాటి నుంచి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. కానీ పోరాడి నిల‌బ‌డ‌గ‌లిగాను అంటూ చెప్పుకొచ్చింది.

ప్ర‌స్తుతం త‌న‌ జీవితం సంతోషంగా ఉంద‌ని.. త‌న‌పై త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని తెలిపింది.