ఆస్పత్రి బెడ్‌పై అబ్బాస్‌.. ఏమైంది?

ప్రేమ దేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారు ఫేవరేట్‌గా మారాడు అబ్బాస్‌. 

అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు.

యూత్‌లో ఆయనకు ఎంత క్రేజ్‌ ఉండేదో మాటల్లో చెప్పలేం. అబ్బాస్‌ కటింగ్‌ అంటే అప్పట్లో కుర్రాళ్లు పడిసచ్చిపోయేవాళ్లు. 

ఇక ఇప్పటి వాళ్లకు అబ్బాస్‌ గురించి చెప్పాలంటే హర్పిక్‌ యాడ్‌తో మళ్లీ అంతే క్రేజ్‌ తెచ్చుకున్నాడు. 

2015 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అబ్బాస్‌.. విదేశాలకు వెళ్లి సెటిలైపోయాడు. 

అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నట్టు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా అబ్బాస్‌ కాలి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతనికి వైద్యులు సర్జరీ చేశారు. 

ఇదే విషయాన్ని చెబుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన పడ్డానని.. భయం వేసిందని రాసుకొచ్చాడు అబ్బాస్‌.

సర్జరీ తర్వాత కొంత ఉపశమనం కలిగింది అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. 

ఇది చూసిన అభిమానులు.. అబ్బాస్‌ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.