ర‌హ‌స్యంగా ఆది పినిశెట్టి నిశ్చితార్థం

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో సెల‌బ్రెటీ జంట ఒక్క‌టి కాబోతున్న‌ది.  ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ తొంద‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు.

వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని కోలీవుడ్‌లో కొంత‌కాలంగా గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్త‌లు నిజ‌మేన‌ని అటు ఆది.. ఇటు నిక్కి గల్రానీ ఇద్ద‌రూ క‌న్ఫార్మ్ చేశారు. త‌మ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను షేర్ చేశారు.

ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో మార్చి 24నే వీరి నిశ్చితార్థం జ‌ర‌గ్గా.. రెండు రోజుల త‌ర్వాత‌ ఆ ఫొటోల‌ను పంచుకున్నారు.

వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్‌కు టాలీవుడ్ నుంచి నాని హాజ‌ర‌య్యాడు.

ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ ఇద్ద‌రూ ‘యాగవరైనమ్‌ నా కక్కా’ సినిమాలో క‌లిసి న‌టించారు. ఈ సినిమా మ‌లుపు పేరుతో తెలుగులో కూడా విడుద‌లైంది.

మ‌లుపు సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి మ‌ర‌క‌త మ‌ణి సినిమాలోనూ న‌టించారు.

ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. స‌రైనోడు, నిన్ను కోరి, రంగ‌స్థ‌లం సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యాడు.