కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు.
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు.
కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.
ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది.
తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.