Mutton

తాజా మటన్‌ను గుర్తించడమెలా?

మీరు కొనే మ‌ట‌న్ తాజాదేనా? లేదా ఎప్పుడో క‌ట్ చేసిన మాంసాన్ని అమ్ముతున్నారా?  ఈ విష‌యం తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారా?

అంత‌గా కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ టిప్స్ పాటించ‌డం ద్వారా తాజా మ‌ట‌న్‌, చికెన్‌ను గుర్తించ‌వ‌చ్చు.

మంచి మ‌ట‌న్, చికెన్ తాజాగా క‌నిపిస్తుంది. ఎప్పుడో క‌ట్ చేసిందైతే పాలిపోయిన‌ట్టుగా, ఎండిపోయిన‌ట్టుగా క‌నిపిస్తుంది.

మ‌ట‌న్ నుంచి ర‌క్తం లేదా నీరు కారుతున్న‌ట్టు ఉంటే దాన్ని తీసుకోకుడ‌దు.

బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మ‌ట‌న్ అని అర్థం చేసుకోవాలి. అందులో కొవ్వు కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

గులాబీ, ఎరుపు మ‌ధ్య రంగులో ఉండే మ‌ట‌న్ అయితేనే ఆరోగ్యానికి మంచిది.

చాలామంది బోన్‌లెస్ మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. నిజానికి బోన్‌లెస్ క‌న్నా కూడా బోన్ మ‌ట‌న్ రుచిగా ఉంటుంది.

బోన్స్ ఉన్న మ‌ట‌న్‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్క‌లు ఉన్న మ‌ట‌నే త్వ‌ర‌గా ఉడుకుతుంది.