క‌రివేపాకుతో జుట్టు న‌ల్ల‌బ‌డుతుందా?

Curry leaves  Benefits

అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. 

వారానికి రెండుసార్లు ఇలా చేస్తే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది.

01.

ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతిపొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. 

ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రంచేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.

02.

మెహందీ, కరివేపాకు, మందారం ఆకులు, కుంకుడు కాయలు అన్నీ అరకప్పు చొప్పున‌ తీసుకుని ముందు రోజు నానబెట్టాలి. 

మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు మెరిసిపోతుంది.

నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లార్చి వారానికి రెండు, మూడుసార్లు జుట్టుకు రాసుకుంటే నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.

కరివేపాకులో ప్రొటీన్లు, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి ఉండటం వల్ల ఇది తింటే అనారోగ్యం దరిచేరదు.