చేయీచేయి కలిపి.. యువతి పెళ్లి చేసి
పెద్దమనస్సు చాటుకున్న ధన్వాడ గ్రామస్తులు
కాటారం, మే 23 : పేదింటి పెళ్లికి గ్రామ స్తులే పెద్దలయ్యారు. నిరుపేద కుటుంబం.. పైగా లాక్డౌన్ సమయం.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఊరోళ్లే అండగా నిలిచా రు. చేయిచేయి కలిపి యువతి పెళ్లి జరిపించా రు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తి కూతురు వివా హం ఆదివారం జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వారి పరిస్థితిని గమనించిన గ్రా మస్తులు కొందరు దగ్గరుండి బంధువుల మా దిరిగా పెళ్లి పనులు చూసుకున్నారు. భోజనాలు కూడా గ్రామస్తులే సమకూర్చారు. ఎంపీటీసీ బోడ మమతాపోచయ్య, బోడ శ్రీధర్ క్వింటాలు బియ్యం సమకూర్చగా, గ్రామ ఉప సర్పంచ్ జంగిలి నరేశ్ వధువుకు కట్నంగా కూలర్‌ను బహూకరించారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భూపెల్లి రాజు పెళ్లి ఖర్చుల నిమిత్తం తనవంతుగా రూ.5వేలు అందజేశారు. ఆ గ్రామస్తుల్లో పరిమళించిన మానవత్వాన్ని చూసి మిగతా గ్రామాల ప్రజలు ప్రశంసించారు.