e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు గోదాముల్లో ధాన్యం నిల్వ

గోదాముల్లో ధాన్యం నిల్వ

గోదాముల్లో ధాన్యం నిల్వ

అంచనాకు మించి దిగుబడి వస్తుండడంతో రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం అనుమతి
గోడౌన్లను సమకూర్చుకుంటున్న మిల్లర్లు
ఇప్పటికే కొన్ని గుర్తింపు.. నేరుగా గోదాములకు చేరుతున్న యాసంగి ధాన్యం
వేగవంతం కానున్న రవాణా

వరంగల్‌రూరల్‌, మే 18 (నమస్తేతెలంగాణ) :
అంచనాకు మించి దిగుబడి వస్తుండడంతో యా సంగి ధాన్యం నిల్వలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రైస్‌మిల్లర్లకు కేటాయిస్తున్న ధా న్యాన్ని గోదాముల్లో నిల్వ చేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు గోదాముల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొందరు అద్దె పద్ధతిలో గోదాములను సమకూర్చుకున్నా రు. అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వాటిలో ధాన్యం నిల్వ కూడా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నేరుగా గోదాములకు చేరుతున్నది.
మున్నెన్నడూ లేని విధంగా దిగుబడులు
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో యాసంగి ధాన్యం రెండు లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 206 కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. మున్నెన్నడూ లేని విధంగా ఈ యాసంగికి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరగడంతో ధాన్యం దిగుబడి అంచనాలకు మించి వచ్చే పరిస్థితి కనపడుతున్నది. ఆలస్యంగా వరి కోతలు మొదలు కావడంతో జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ఊపందుకున్నది. అయినా సోమవారం వరకు జిల్లాలో సుమారు 87 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రోజు 5 నుంచి 7 వేల టన్నుల వరకు ధాన్యం సేకరిస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు భాస్కర్‌రావు వెల్లడించారు. అంచనాలకు మించి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు.
రైస్‌మిల్లుల్లో స్థలం కొరత..
రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని 81 రైస్‌మిల్లులకు కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ రైస్‌మిల్లులకు ట్యాగింగ్‌ చేశారు. అంచనాకు మించి దిగుబడి వస్తుండడంతో మిల్లుల్లో ధాన్యం పోటెత్తుతున్నది. నిల్వలు పేరుకు పోవడంతో పలు రైస్‌మిల్లుల్లో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు వాతవరణంలో మార్పులతో వర్షాలు పడే సూచనలు కనపడుతుండడంతో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు మిల్లర్లకు అనుమతి ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో స్థలం కొరత ఉన్న రైస్‌మిల్లర్లు రెండు మూడు రోజుల నుంచి ప్రభు త్వ, ప్రైవేట్‌ గోదాముల కోసం వెతుకుతున్నారు.
నేరుగా గోదాములకు తరలింపు..
వర్ధన్నపేట, రాయపర్తి, పరకాల, శాయంపేట, ఆత్మకూరు, గీసుగొండ, దామెర మండలాల్లోని వర్ధన్నపేట(ఇల్లంద), పరకాల, శాయంపేట, గూడప్పాడ్‌ వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ల గోదాములు, గొర్రెకుంట, మురిపిరాల తదితర ప్రాం తాల్లోని ప్రైవేటు గోదాముల్లో తాజాగా రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేస్తున్న ధాన్యానికి సంబంధించి అద్దెను రైస్‌మిల్లర్లే భరిస్తారు. ఇక్కడ నిల్వ చేసే ధాన్యం పూర్తి బా ధ్యత కూడా వారిదే. గోదాములను రైస్‌మిల్లర్లకు సమకూర్చడంలో అధికారులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుం చి ధాన్యాన్ని రైతులు తమ సొంత వాహనాల్లో రైస్‌మిల్లులు, గోదాముల వరకు రవాణా చేస్తే సంబంధిత ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం ఖరారు చేసి న ట్రాన్స్‌పోర్టు చార్జీలను చెల్లిస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం భాస్కర్‌రావు స్పష్టం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోదాముల్లో ధాన్యం నిల్వ

ట్రెండింగ్‌

Advertisement