వరంగల్‌రూరల్, మార్చి 16(నమస్తేతెలంగాణ): గ్రామ పంచాయతీల పరిధిలో అద్దెల రూపంలో ఆదాయం సమకూ ర్చుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, టేలడబ్బాలు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న ది. ఇప్పటికే జిల్లాలోని పదమూడు మండలాల్లోని 57 గ్రామ పంచాయతీల పరిధిలో 57 షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, 73 టేలాల ఏర్పాటు కోసం అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాల ను అధికారులు గుర్తించి సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. అందుబాటులో ఉన్న నిధుల వివరాలను కూడా తెలియజేశారు. ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలు పరిశీలి స్తున్నారు. ఒక్క దామెర మండలం నుంచే 26 షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం ప్రపోజల్స్ రావడం విశేషం. ప్ర భుత్వం సానుకూలంగా ఉన్నందున త్వరలోనే వీటి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, టేలాల ఏర్పాటు కోసం ఇప్పటి వరకు జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో ఆత్మకూరు మండలం లోని నీరుకుల్ల, ఆత్మకూరు, చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్, దామెర మండలంలోని దామెర, దమ్మన్నపేట, దుర్గంపేట, కొగిల్వాయి, ల్యాదెల్ల, ముస్త్యాలపల్లి, ఒగ్లాపూర్, ఊరుగొండ, పసరగొండ, పసరగొండ, పులుకుర్తి, సింగరాజు పల్లి, సీతారాంపురం, తక్కళ్లపాడ్, వెంకటాపురం, దుగ్గొండి మండలంలోని చలపర్తి, దుగ్గొండి, లక్ష్మీపురం, ముద్దునూరు, తిమ్మంపేట, నడికూడ మండలంలోని కంఠాత్మకూరు, నడి కూడ, వరికోలు, నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట, నల్ల బెల్లి, రామతీర్థం, శనిగరం ఉన్నాయి. నెక్కొండ మండలం లోని నెక్కొండ, పరకాల మండలంలోని నాగారం, వెల్లంపల్లి, పర్వతగిరి మండలంలోని అన్నారంషరీఫ్, బూర్గుమల్ల, చిం తనెక్కొండ, ఏనుగల్లు, గోపనపల్లి, జమలాపూర్, కొంకపాక, రాయపర్తి మండలంలోని గణేశ్కుంటతండా, గన్నారం, జగ న్నాథపల్లి, రాయపర్తి, సూర్యతండా, తిర్మలాయపల్లి, సంగెం మండలంలోని చింతలపల్లి, పల్లారుగూడ, శాయంపేట మం డలంలోని ప్రగతిసింగారం, పత్తిపాక, తహరాపూర్, వర్ధన్నపే ట మండలంలోని అంబేద్కర్‌నగర్, చెన్నారం, దమ్మన్నపేట, ఇల్లంద, కట్య్రాల, ల్యాబర్తి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, టేలాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించిన గ్రామా ల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఏనుగల్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కు మార్, నల్లబెల్లి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రగతి సింగారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరికోలు ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామం.
స్థలాల గుర్తింపు జరిగిన గ్రామాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు ని ర్మించేవి 38 ఉన్నాయి. మిగతా 18 గ్రామాలు టేలాలు ఏర్పా టు చేసేవి. షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం ప్రతిపాదన లు పంపిన గ్రామాల్లో ఆత్మకూరు, నీరుకుల్ల, దామెర, కొగి ల్వాయి, ల్యాదెల్ల, ఒగ్లాపూర్, ఊరుగొండ, పులుకుర్తి, తక్క ళ్లపాడ్, చలపర్తి, లక్ష్మిపురం, ముద్దునూరు, తిమ్మంపేట, చర్ల పల్లి, నడికూడ, వరికోలు, నల్లబెల్లి, నెక్కొండ, నాగారం, వె ల్లంపల్లి, అన్నారంషరీఫ్, బూర్గుమల్ల, చింతనెక్కొండ, ఏను గల్లు, కొంకపాక, గణేష్కుంటతండా, గన్నారం, జగన్నాథ పల్లి, రాయపర్తి, సూర్యతండా, తిర్మలాయపల్లి, చింతలపల్లి, పల్లారుగూడ, ప్రగతిసింగారం, అంబేద్కర్‌నగర్, చెన్నారం, ఇల్లంద, ల్యాబర్తి ఉన్నాయి. వీటిలో దామెర, కొగిల్వాయి, ల్యాదెల్లలో ఆరేసి, ఒగ్లాపూర్‌లో నాలుగు, తక్కళ్లపాడ్లో రెండు, ఇతర గ్రామాల్లో ఒక్కో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. సదరు గ్రామపంచాయతీల్లో నిధులు అందుబాటులో ఉన్నట్లు నివేదికలో తెలిపారు.
షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మా ణం, టేలాల ఏర్పాటు చేసేందు కు ఆయా గ్రామపంచాయతీ పరి ధిలో అనువుగా ఉన్న ప్రభు త్వ స్థలాలను గుర్తిస్తున్నం. ఇప్పటికే జిల్లాలో 57 సర్కారు స్థలాలను గుర్తించాం. ఆయా గ్రామపంచా యతీ నుంచి అందిన ప్రతిపాద నలను జిల్లా కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లాం. కాంప్లెక్స్‌ల నిర్మాణం, టేలాడబ్బాల ఏర్పాటుకు పంచాయతీలను ప్రోత్సహిస్తున్నం. ప్రతిపాదనలు అందజేసిన జీపీలకు త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది.
– చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి