e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌

రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌

రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌

నర్సంపేట, జూన్‌ 16 : కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు రైతులు, వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నాయని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం నియోజక వర్గంలోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలకు చెందిన 25 మంది రైతు కుటుంబాలకు మంజూరైన రూ.1.25 కోట్ల విలువైన రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబీమా పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నదని అన్నారు. గుంట భూమి ఉన్న రైతులకూ రైతు బీమా పథకం అమలవుతున్నదని తెలిపారు. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌ వ్యవసాయాధికారులకు ఇస్తే వారే దరఖాస్తు చేస్తారని తెలిపారు. ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే మృతుడి కుటుంబ సభ్యులకు రైతుబీమా కింద రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 377 మంది రైతు కుటుంబాలకు రూ.18.85 కోట్లు అందించినట్టు తెలిపారు. ప్రమాద బీమాను ఐక్యరాజ్యసమితి అభినందించడం గర్వించదగ్గ విషయం అన్నారు. కార్యక్ర మం లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీ టీసీ సభ్యులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
రైతు కుటుంబానికి అండగా రైతుబీమా
దుగ్గొండి : దేశానికి అన్నం పెట్టే రైతన్న మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామానికి చెందిన రైతు నల్ల రమేశ్‌(50) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రూ.5 లక్షల రైతుబీమా చెక్కును సర్పంచ్‌ ముదురుకోల శారద ఆధ్వర్యంలో తన క్యాంపు ఆఫీసులో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీని వాస్‌, ఎంపీపీ కాట్ల కోమల, వ్యవసాయాధికారి చిలువేరు దయాకర్‌, సర్పంచ్‌, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
పీజీ కళాశాల ఏర్పాటు చేయండి
నర్సంపేట : నర్సంపేటలో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరా రు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేయూ అధికారులతో కలిసి ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. నర్సంపేటలో పీజీ కళాశాల ఏర్పాటు అవసరం అన్నారు. దళి త, గిరిజన, వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే నర్సంపేటలో పీజీ కాలేజీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో 250 పడకల ఆస్పత్రికి టెండర్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. 800 మంది కూర్చునే ఆడిటోరియం అందుబాటులోకి రానుందని తెలిపారు. నర్సంపేటలో పీజీ కళాశాల ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పీజీ సెంటర్‌ మంజూరు చేస్తే ప్రభుత్వంపై, యూనివర్సిటీపై ఆధారపడ కుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న పీజీ కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరారు. నర్సంపేటను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. బృందంలో కేయూ ప్రొఫెసర్‌ మనో హర్‌, ప్రొఫెసర్‌ మల్లారెడ్డి, ఫ్రొఫెసర్‌ వరలక్ష్మి, ప్రిన్సిపల్‌ ప్రణయ్‌కుమార్‌, డాక్టర్‌ మదన్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌
రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌
రైతుల్లో భరోసా నింపిన కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement