e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home వరంగల్ రూరల్ ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం
  • అన్ని మతాల వారికి సమప్రాధాన్యం
  • ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ రామస్వామినాయక్‌
  • జిల్లాలో ముస్లింలకు రంజాన్‌ కానుకల పంపిణీ

ఖానాపురం, మే 11: ముస్లిం మైనార్టీల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. ప్రభుత్వం అందజేసిన రంజాన్‌ కానుకలను మండలకేంద్రంలో మంగళవారం ఆయన ముస్లింలకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ముస్లిం మత పెద్దలు కలీం, ఎండీ అజహర్‌, ఖాజాపాషా, యాకూబ్‌పాషా, సైపుల్లా , మౌలానా, ఆర్‌ఐ ఉపేందర్‌, వీఆర్వో శ్రావణ్‌ పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
పరకాల: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత అన్నారు. తహసీల్‌లో ముస్లింలకు రంజాన్‌ కానుకలు పంపిణీ చేశారు. కుల, మతాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిలివేరు మొగిలి, తహసీల్దార్‌ జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

వర్ధన్నపేట: మండలంలోని గ్రామాల్లో ఉన్న ముస్లింలకు సర్పంచ్‌లు రంజాన్‌ కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెన్నారావుపేట: మండలంలోని ముస్లింలకు జడ్పీటీసీ బానోత్‌ పత్తినాయక్‌ సమక్షంలో తహసీల్దార్‌ పూల్‌సింగ్‌చౌహాన్‌ రంజాన్‌ కానులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై శీలం రవి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్‌ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ గఫార్‌, మహ్మద్‌ ముస్లిం మజీద్‌ అధ్యక్షుడు అయ్యుం, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, వార్డు సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, డీటీ మధుసూదన్‌, గిర్దావర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ: మండలకేంద్రంలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సొంటిరెడ్డి యమున-రంజిత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ మారం రాము, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, జడ్పీకో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, వైస్‌ ఎంపీపీ రామారపు పుండరీకం, ఎంపీటీసీ ఈదునూరి కరిష్మ, ముస్లిం మత పెద్దలు ఎస్‌కే షబ్బీర్‌, ఎస్‌కే చందుమియా, ఎండీ రఫీ, ఎండీ అమీర్‌ పాల్గొన్నారు.
నడికూడ: తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో రంజాన్‌ కానుకలను ముస్లింలకు ఎంపీపీ మచ్చ అనసూర్య అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోడెపాక సుమలత-కరుణాకర్‌, సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు, తహసీల్దార్‌ వీ మహేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
సంగెం: తహసీల్‌లో మండలంలోని 210 పేద ముస్లింలకు ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ బీ విశ్వనారాయణ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ అలీ, సర్పంచ్‌ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు నరహరి, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఆర్‌ఐ ఆనంద్‌కుమార్‌, ఎండీ యాకూబ్‌ పాషా, పాషా పాల్గొన్నారు.

మతసామరస్యానికి పెద్దపీట
దామెర: తెలంగాణ ప్రభుత్వం మతసామరస్యానికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ కాగితాల శంకర్‌ అన్నారు. ల్యాదెళ్లలో 120 మంది ముస్లిం లబ్ధిదారులకు రంజాన్‌ కానుకలను ఎంపీపీ అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రియాజొద్దీన్‌, మాజీ సర్పంచ్‌ హింగె శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ రమేశ్‌, అన్వర్‌పాషా, కుక్క అనిల్‌ పాల్గొన్నారు.

సర్కారు ప్రోత్సాహం మరువలేనిది
రాయపర్తి: కులమతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని పెర్కవేడు సర్పంచ్‌ చిన్నాల తారాశ్రీ రాజబాబు అన్నారు. గ్రామంలోని మసీదులో ముస్లింలకు రంజాన్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండి అనూష-రాజబాబు, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బొమ్మెర వీరస్వామి, ఉప సర్పంచ్‌ మంగిశెట్టి రాజు, మహ్మద్‌ అమ్జద్‌ పాషా, కుల్లా వెంకన్న, నిమ్మల కుమార్‌, రాజమహ్మద్‌, రహీం, రఫీ, మైపాషా, పాషా, అఫ్జల్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement