e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

నర్సంపేట రూరల్‌, జూన్‌ 6: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కమ్మపల్లి సర్పంచ్‌ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ అన్నారు. ఆదివారం మండలంలోని కమ్మపల్లి గ్రామంతో పాటు దాసరిపల్లి, రాజేశ్వర్‌రావుపల్లి, చంద్రయ్యపల్లి, ఆకులతండా, పర్శనాయక్‌తండా గ్రామాల్లో జీపీ సిబ్బందితో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉంటే నయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లుపాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని కొంకపాక, గోపనఫల్లి, అనంతారం, ఏనుగల్‌, చింతనెక్కొండ గ్రామాల్లోని వీధుల్లో పరిశుభ్రత కోసం ఆదివారం జీపీ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. వడ్లకొండ, పర్వతగిరి, అన్నా రం షరీఫ్‌, బూరుగుమళ్ల, మంగ్త్యా తండా, ఏబీ తండాతో పాటు పలు గ్రామాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా నియంత్రణకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, జీపీ సిబ్బంది తమ వం తు కృషి చేస్తున్నారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరుతూ వారు అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement