నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు
మధ్యాహ్నం మూడున్నర గంటలకు..
నేడు నోటిఫికేషన్
రెండూ ఏకగ్రీవమయ్యే అవకాశం
ముందుగా కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేట ర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవా రం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం నిర్వ హించి 3.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా రెండు ఎలక్షన్లకు జిల్లా ఎన్నికల అధికారి నేడు నోటిఫికేషన్ విడుదల చేయను న్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బీసీ జనరల్‌కే మేయర్ పదవి
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు గత నెల 30న జరిగా యి. ఈ నెల 3న ఫలితాలు వచ్చాయి. నగరంలోని 66 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 48 డివిజన్లలో విజ యం సాధించింది. బీజేపీ 10, కాంగ్రెస్ 4, స్వతంత్రు లు 4 స్థానాల్లో గెలిచారు. ఏకపక్ష విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి మేయర్, డిప్యూటీ మేయర్ స్థా నాలను కైవసం చేసుకుంటోంది. మేయర్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు అయ్యింది. డిప్యూటీ మేయ ర్కు రిజర్వేషన్లు ఉండవు. ఈ రెండు పదవుల కోసం ఎన్నిక శుక్రవారం జరుగనుంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ రెండు ఎన్నికల కోసం ప్రత్యే క సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా మేయ ర్ ఎన్నిక కోసం నామినేషన్లు దాఖలు చేయాలి. ఒక కా ర్పొరేటర్ ప్రతిపాదించడం, మరొకరు బలపరిచిన వా రిని అభ్యర్థిగా గుర్తిస్తారు. అనంతరం చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ సైతం ఇలానే ఉంటుంది. టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో రెండు పదవులు ఏక గ్రీవమయ్యే అవకాశముంది.