ముందే పలకరించిన తొలకరి
అప్పుడే పొలం పనుల్లో రైతులు బిజీ
ఇప్పటికే నిండుగా సాగునీటి వనరులు
అదునులో అండగా నిలుస్తున్న సర్కారు
ఆనందంగా ‘సాగు’తున్న అన్నదాతలు
ఊపందుకున్న ఎరువులు, విత్తనాల కొనుగోలు
ఇప్పుడే కొన్నిచోట్ల వరినాట్లు మొదలు
వరంగల్/జనగామ/మహబూబాబాద్ ఫొటో గ్రాఫర్లు: శుభసూచకంగా జూన్ నెల ప్రారంభంకాగానే తొలకరి పలకరించింది. రెండు, మూడు రోజులుగా సాలేటి వానలు పడుతున్నయ్. ఇప్పటికే చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీరున్నది. భూ గర్భ జలాలు మస్తుగున్నయ్. ఈనెల 15 నుంచి ‘రైతుబంధు’ సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో పెట్టుబడికి ఆసరా దొరికింది. కరంటు కష్టాలు ఎన్నడో తీరినయ్.. అదునుకు అన్నీ అందుతుండడంతో అన్నదాతల్లో ఆనందం రెట్టించింది.. ఇంకేం వానకాలం పంట వేసేందుకు అప్పుడే కర్షకలోకం బిజీగా మారింది. ఎక్కడచూసినా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోళ్ల సందడి కనిపిస్తున్నది. కొన్ని గ్రామాల్లో ఏరువాక షురువైంది. దుక్కి దున్నుడు, విత్తనాలు అలుకుడు, నారు మడులు తయారు చేసుడు, నాట్లేసుడు మొదలైంది. సంబురమసోంటి సాగు చిత్రాలను ‘నమస్తే’.. మీ ముందుకు తెచ్చింది.