e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌

డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌

తండ్రికి తగ్గ తనయుడు తారక రాముడు
రాష్ర్టాభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిది
ఐటీ రంగంలో తెలంగాణ దిగ్గజం
రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు
‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ద్వారా దివ్యాంగులకు త్రీవీలర్‌ స్కూటీల పంపిణీ

పాలకుర్తి రూరల్‌, జూలై 24 :‘ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో 105 వాహనాలు సమకూరుస్తున్నట్లు వెల్లడి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పాలకుర్తి, తొర్రూరు (జే), రాయపర్తి, కోలుకొండ, వరంగల్‌ కోటలో మొక్కలు నాటిన ఎర్రబెల్లి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని, తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని, తండ్రికి తగ్గ తనయుడు తారక రాముడని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు కొనియాడారు. మంత్రి రామన్న పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగం గా పాలకుర్తిలో ‘ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వరంలో ఐదుగురు దివ్యాంగులకు త్రీవీలర్‌ స్కూటీలను అందజేశారు. అనంతరం మండల కేంద్రం తో పాటు తొర్రూరు (జే) గ్రామంలో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా కోటి రూపాయల వ్యయంతో 105మంది దివ్యాంగులకు స్కూటీలు అందిస్తానని చెప్పారు.

కేటీఆర్‌ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ నాయకత్వంలో అన్ని ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. కేటీఆర్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతున్ని ప్రార్థించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతేడాది కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా దవాఖానలకు అంబులెన్స్‌లను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎండీ అబ్దుల్‌ హమీద్‌, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో రంగాచారి, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్‌ ధరావత్‌ గాంధీనాయక్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, వర్రె వెంకన్న, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొబ్బల అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్‌, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, నాయిని మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గోనె మైసిరెడ్డి, ఎంపీడీవో వీ ఆశోక్‌కుమార్‌, మేడారపు సుధాకర్‌, గంట పద్మాభాస్కర్‌ పాల్గొన్నారు,
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..
దేవరుప్పుల : ఐటీ రంగంలో తెలంగాణను దిగ్గజంగా చేసిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని, ఆయన చొరవతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. దేవరుప్పుల మండలం కోలుకొండలో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం మొక్కనాటి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. కోలుకొండ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా 3.5 కిలోమీటర్ల మేర 3500 మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇక్కడ అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, ఎంపీపీ బస్వ సావిత్రి, మండల ప్రత్యేకాధికారి కొండాల్‌రెడ్డి, ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, సర్పంచ్‌ కూర్నాల రవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తీగల దయాకర్‌, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్‌, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్‌ కోతి పద్మ, చింత రవి, కోతి ప్రవీణ్‌, బోనగిరి యాకస్వామి పాల్గొన్నారు.
కోటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
ఖిలావరంగల్‌ : చారిత్రక ఓరుగల్లు కోటలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. కోటలో 10వేల మొక్కలు నాటారు. పర్యాటక రంగంలో వరంగల్‌ కోటను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే నరేందర్‌, తాను కలిసి మూ డు గంటల పాటు చర్చించినట్లు చెప్పారు. దేశం లో ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో రూ.2వేల కోట్ల నిధులతో 33 అంతస్తుల అతిపెద్ద వైద్యశాల ను నిర్మించుకుంటున్నామన్నారు. రెండేళ్లల్లో ప నులు పూర్తవుతాయన్నారు. ఎమ్మెల్యే నరేందర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, దయాకర్‌రావు ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గ రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామన్నా రు. డిప్యూటీ మేయర్‌ సయ్యద్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్‌, 37, 38వ డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ సురేశ్‌, బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గజ్జెల శ్యాం, సంగరబోయిన చందర్‌, నలిగంటి నవీన్‌, చింతం అమర్‌వర్మ, తోటకూరి చేరాలు, మందాటి శ్రీధర్‌, ఇ నుముల మల్లేశం, పగడాల సతీష్‌, ఎంఏ జబ్బా ర్‌, ఎండీ చాంద్‌పాషా, గడల రమేశ్‌, మైదం నరే శ్‌, ఎండీ అంకూస్‌, ఎండీ సమీనాఫారుఖ్‌, పోశా ల పద్మ, ఎండీ ఉల్ఫత్‌, ఎండీ ఫిరోజ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana