అందరి చూపూ టీఆర్ఎస్ వైపే..

- జోరుగా కొనసాగుతున్న
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
నల్లబెల్లి, ఫిబ్రవరి 22 : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. అన్ని వర్గాల వారూ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. మండలంలోని బోల్లోనిపల్లె గ్రామంలో సోమవారం సుమారు 90 మంది గంగిరెద్దుల కులస్తులకు సర్పంచ్ తిప్పని సృజనా లింగమూర్తి, ఎంపీటీసీ బోళ్ల శ్రీలత, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలుదాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల కుల పెద్దమనిషి మోరం చిన్నవెంకటయ్య మాట్లాడుతూ తాము సంచార జీవులమైనా గ్రామంలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, రేషన్ కార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. టీఆర్ఎస్ రుణం తీర్చుకోలేనిదన్నారు. అలాగే, గ్రామంలోని కల్లు మండువాలో గీతకార్మికులు కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకుడు గాజర్ల మల్లయ్య మాట్లాడుతూ తమకు పింఛన్ల మంజూరుతోపాటు తాటి చెట్లకు పన్ను రద్దు చేసినందుకు ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో గాజర్ల మల్లయ్య, గట్టు సాంబయ్య, తిప్పని సారయ్య, జిడ్డి సారయ్య, యాకయ్య, కనకరాజు, ఆవుల స్వరూప, మోరం వెంకటమ్మ, యాకమ్మ, సారమ్మ, మాదాసు రాజమౌళి, బోయిని రవి, మాదాసి శంకరయ్య పాల్గొన్నారు.
80 ఏళ్ల వృద్ధురాలి సభ్యత్వం
నడికూడ : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలకు యువకులతో పాటు వృద్ధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్న ముసలివారు కూడా ఉత్సాహంగా సభ్యత్వం అడిగి మరీ తీసుకుంటున్నారు. మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో 80 ఏళ్లకు పైబడిన గుడికందుల ఐలమ్మ పార్టీ సభ్యత్వం పొంది, సంతోషం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- ఆయన వస్తే మార్పులేం ఉండవు.. వైస్సార్సీపీలోకి గంటా రాకపై విజయ్ సాయి
- నా పేరే..సారంగ దరియా!
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- పెట్రోల్ ధరల సెగ.. విద్యుత్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్