రమ్యకృష్ణ ఎప్పుడు చాలా హుందాగా, సత్ప్రవర్తనతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎదుటి వారిని కూడా కష్ట పెట్టే మనస్తత్వం ఆమెది కాదు. అయిటే ఈ సీనియర్ హీరోయిన్‌పై బిగ్ బాస్ ఫేం, సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు దారుణమైన కామెంట్స్ చేసింది. షోస్ కన్నా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వచ్చిన వనిత మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆ మూడు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. ప్రస్తుతం టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న వనిత.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆ షో నుండి వెళ్లిపోయినట్లు లేఖ ద్వారా తెలిపింది. మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా నా ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్నారని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది వనిత
బిగ్ బాస్ జోడిగల్ షోకి హోస్ట్ వ్యవహరిస్తోన్న నటి రమ్యకృష్ణ ఈ షో మొత్తంలో సీనియర్ . వనిత ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. ఈ వివాదం గురించి కోలీవుడ్ ఛానెల్ రమ్యకృష్ణ ని అడగగా, దానికి ఆమె హుందాగా బదులిచ్చింది. షోలో ఏం జరిగిందో కూడా కనుక్కుంటే బాగుండేది. నా వరకు ఇది పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అంటూ షో చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ.