మంగళవారం 02 మార్చి 2021
Warangal-rural - Jan 27, 2021 , 01:25:54

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి

సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి

  • పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు
  • కలెక్టర్‌ ఎం హరిత
  • కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు

ధర్మారం, జనవరి 26: అధికారుల సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని కలెక్టర్‌ ఎం హరిత అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో ఆమె త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లాను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ అన్ని వేళలా సహకరిస్తున్న మీడియాకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ తాగునీటిని కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్వో భూక్యా హరిసింగ్‌, అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, జడ్పీ సీఈవో రాజారావు, అగ్రికల్చర్‌ జేడీ ఉషాదయాళ్‌, మిషన్‌ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, ఏసీపీలు నరేశ్‌కుమార్‌, ఫణీంద్ర, సీఐ కిషన్‌, ఏవో రాజేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo