రాజ్యాంగంతోనే అన్ని వర్గాలకు న్యాయం

- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, జనవరి 26 : రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నా రు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత, జడ్పీటీసీ సిలివేరు మొగిలి, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఆత్మకూరు/దామెర : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో ఆత్మకూరు మండలానికి చెందిన 57 మంది, దామెర మండలానికి చెందిన 57 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. సంక్షేమ ఫలాలను పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా గడపగడపకూ తాగు నీరు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కిషన్, దామెర ఎంపీపీ శంకర్, జడ్పీటీసీలు కక్కెర్ల రాధికారాజు, కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్‌లు సత్యనారాయణ రెడ్డి, అర్షం బలరాం, సాంబ య్య, గోవిందు అశోక్, పున్నం రజిత, గట్ల విష్ణువర్థన్‌రెడ్డి, కుక్క శ్రావణ్య అనిల్, వడ్డెపల్లి శ్రీనివాస్, కేతిపల్లి సరోజనారెడ్డి, రజితా సత్యం, రైతు బంధు సమితి ఆత్మకూరు మండల కోఆర్డినేటర్ రవీందర్, ఎంపీటీసీలు పోలం కృపాకర్‌రెడ్డి, రామకృష్ణ, మౌనికాకిరణ్, శ్రీలత, గోవిందు సంధ్య అశోక్, తహసీల్దార్ విశ్వనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బొల్లోజు కుమారస్వామి, పాపని రవీందర్, అర్షం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్