మంగళవారం 02 మార్చి 2021
Warangal-rural - Jan 27, 2021 , 01:20:20

వర్ధన్నపేటలో జెండావిష్కరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేటలో జెండావిష్కరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ భాస్కర్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ గొల్ల రమేశ్‌, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ ఆంగోతు అరుణ జాతీయ పతాకాలను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే, మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా సర్పంచ్‌లు పంచాయతీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేశారు. ప్రధాన కూడళ్లు, సంస్థల్లో ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాలకుర్తి సుజాత, రామకృష్ణ, రవీందర్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo