లక్షణంగా వదిలేశారు!

- మధ్యలోనే ఆగిపోయిన జీపీ భవనాల నిర్మాణం
- ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వృథా
- చోద్యం చూస్తున్న అధికారులు
నల్లబెల్లి, జనవరి 24: జీపీ భవనాలు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా విడుదల చేసిన నిధులు అధికారుల నిర్లక్ష్యంతో వృథా అవుతున్నాయి. కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులు నిలిపివేసి నిధులు కాజేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని గోవిందాపూర్, గుండ్లపహాడ్, నారక్కపేట, లెంకాలపెల్లి, రేలకుంట, శనిగరం, అర్శనపెల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఒక్కో జీపీకి రూ. 16 లక్షల నిధులు విడుదల చేసింది. ఆ నిధులను గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేసింది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు భవన నిర్మాణ పనులను సగం వరకు చేసి అధికారుల అండతో అందినకాడికి దండుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో జీపీలకు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గడువులోగా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకపోవడంతో ఆ నిధులను వేరే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న జీపీ భవనాల పనులను పూర్తి చేయించాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్‌సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు