మంగళవారం 02 మార్చి 2021
Warangal-rural - Jan 25, 2021 , 00:17:37

డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడుపాలి

డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడుపాలి

నర్సంపేట, జనవరి 24: డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడుపాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ బీ శ్రీనివాసరావు కోరారు. ఆదివారం డిపోలో డ్రైవర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, పలు విభాగాల డిపో ఉద్యోగులు ప్రధాన ద్వారం వద్ద ఒకరికొకరు పువ్వులు అందించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ డ్రైవర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వరంగల్‌ రీజియన్‌ గత మేనేజర్‌ సూర్యకిరణ్‌ మొదటిసారిగా 2017 జనవరి 24న డ్రైవర్స్‌ డేను ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పువ్వులు అందించి డ్రైవర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ సరస్వతి, ఎస్టీ కృష్ణకుమారి, శాంతమ్మ, చారి, తోటకూరి వెంకటేశ్వర్లు, మహిపాల్‌, ప్రవీణ్‌, మహేందర్‌, సోమరాజు, మోతి శ్రీను, భాస్కర్‌, సింగ్‌, నరేశ్‌, మొగిలి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo