శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 24, 2021 , 02:29:32

ఎన్నో సమస్యలను పరిష్కరించా

ఎన్నో సమస్యలను పరిష్కరించా

  • అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్‌
  • ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

శాయంపేట, జనవరి 23 :  ఎన్నో సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి   ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శాయంపేటలో శనివారం రాత్రి జరిగింది. ఎంపీ పసునూరి దయాకర్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పల్లా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ  నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. 14.2 శాతం వృద్ధి రేటుతో చాలా రాష్ర్టాల కన్నా మెరుగ్గా ఉన్నామన్నారు.  అనేక నీటి పారుదల ప్రాజెక్టులను ఉద్యమ స్ఫూర్తితో పూర్తి చేసుకున్నామన్నారు. నెల రోజుల్లో  70వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మళ్లీ ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కార గొంతుగా ఉంటానని పల్లా హామీ ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు పల్లాను మరోసారి గెలిపించి రాజకీయాల్లో మలుపు తీసుకురావాలన్నారు. ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదన్నారు. రైల్వే, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర పథకాలకు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాను గెలిపించి కేంద్రానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జనగామ జడ్పీ చైర్మన్‌ పాకాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కర్ర ఆదిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ చంద్రప్రకాశ్‌, సర్పంచ్‌ కందగట్ల రవి,  దైనంపెల్లి సుమన్‌ పాల్గొన్నారు.  

VIDEOS

logo