శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 23, 2021 , 00:14:29

మార్కెట్‌లో ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలి

మార్కెట్‌లో ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలి

  • గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ 
  • చైర్మన్‌ కేశవరెడ్డి

ఆత్మకూరు, జనవరి 22: ప్రభుత్వ ఆదేశాల  మేరకు మార్కెట్‌లో ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలని గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి అన్నారు. శుక్రవారం మార్కెట్‌ ఆవరణలో ఆత్మకూరు, దామెర, హసన్‌పర్తి మండలాల వ్యవసాయాధికారులు, మండల, గ్రామ రైతు కోఆర్డినేటర్లు, వైస్‌ చైర్మన్లు, రైస్‌ మిల్లర్లతో నిర్వహించి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసినందుకుగాను, రైతుల సౌకర్యార్థం అవగాహన  కల్పించారు. వైస్‌ చైర్మన్‌ దాడి మల్ల య్య, మండల కోఆర్డినేటర్‌ రవీందర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు గోల్కొండ శ్రీనివాస్‌, భిక్షపతి, మాల్లారెడ్డి, అంబారి విజ య్‌, రాజేశ్వర్‌రావు, రాజూనాయక్‌, నిమ్మల, స్వరూప, భిక్షపతి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అంబాటి రాజస్వామి, మార్కెట్‌ కార్యదర్శి కుమారస్వామి, ఏఏవో, ఏఈవో, సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo