శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 23, 2021 , 00:14:29

‘కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటాం’

‘కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటాం’

ఆత్మకూరు, జనవరి 22: ఆపదలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి అన్నారు. అగ్రంపహాడ్‌, చౌళ్లపల్లిలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తెలియజేసి ఆదుకుంటామన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ కక్కెర్ల రాధిక-రాజు, గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ రవీందర్‌, యూత్‌ మండల అధ్యక్షుడు వేముల నవీన్‌, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య-రవీందర్‌, జాతర మాజీ చైర్మన్లు శీలం సాంబయ్య, కత్తెరశాల మల్లేశం, బొల్లోజు కుమారస్వామి, సావురే రాజేశ్వర్‌రావు, గుర్రం వేణు, మోరె మహేందర్‌, రాజేశ్వర్‌రావు, ఆవుల రాజు పాల్గొన్నారు.

VIDEOS

logo