శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 23, 2021 , 00:14:29

నిండుకుండలా రంగాయ చెరువు

నిండుకుండలా రంగాయ చెరువు

  • గోదావరి జలాలతో కళకళ  
  • తొలిసారిగా 16 వందల ఎకరాలకు సాగునీరు 
  • రైతుల హర్షం

నల్లబెల్లి, జనవరి 22: గోదావరి జలాలతో మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. రంగాయ చెరువు ప్రాజెక్టుకు రూ. 315 కోట్లు, రామప్ప-పాకాల పైపులైన్‌ ఏర్పాటు కోసం మరో రూ. 230 కోట్ల నిధులతో పనులు మొదలు పెట్టి అవిశ్రాంతంగా శ్రమించారు. ప్రాజెక్టుకు ఇరువైపులా 14.2 కిలో మీటర్ల పొడవుతో కుడి కాల్వ, 14.5 కిలో మీటర్ల పొడవుతో ఎడమ కాల్వను ఏర్పాటు చేశారు. ఇటీవల గోదావరి జలాలను రంగాయ చెరువులోకి తరలించేందుకు ట్రయల్‌ రన్‌ చేసి సఫళీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో కాకతీయులు నిర్మించిన రంగాయ చెరువులోకి గోదావరి జలాలను తరలించి 16 వందల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సొంతంగా సుమారు రూ. 10 లక్షలు వెచ్చించి చెరువు ప్రధాన పంట కాల్వల పనులను పునరుద్ధరించారు. ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలతో చెరువును నింపడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా యాసంగి వరి సాగుకు 16 వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుండడంతో రైతులు పెద్దికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

VIDEOS

logo