శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 22, 2021 , 00:42:43

‘వస్తువుల ధరల పెంపులో మోదీ ఘనుడు’

‘వస్తువుల ధరల పెంపులో మోదీ ఘనుడు’

నర్సంపేట, జనవరి 21: నిత్యావసర వస్తువుల ధరల పెంపులో ప్రధానమంత్రి మోదీ ఘనుడని ఏఐఎఫ్‌డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ అన్నారు. ఏఐఎఫ్‌డీడబ్ల్యూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిన కేంద్రం ధరలు పెంచి కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పుట్టపాక సునీత, ఈర్ల రాజు, గడ్డం స్వరూప, మాదాసి రాజు, ఐలమ్మ, వెంకన్న, రజిత, చంద్రకళ, ప్రమీల, పుష్ప, నవనీత్‌, లక్ష్మి, హైమద్‌, సుశీల పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి 

నెక్కొండ: రైతులను దగా చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సీఐటీయూ చేపట్టిన కార్మిక, కర్షక పోరు యాత్ర మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పోరుయాత్ర కార్యక్రమం ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాగుల రమేశ్‌, జిల్లా కన్వీనర్‌ అనంతగిరి, జిల్లా కో కన్వీనర్‌ కందికట్ల వీరేశ్‌, గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈదునూరి వెంకన్న, నాయకులు గుజ్జుల వెంకన్న, సాయిలు, సైదాబి, శివరాజ్‌, సూరయ్య, యార ప్రశాంత పాల్గొన్నారు.

VIDEOS

logo