టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా బీమా

- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, జనవరి 21 : ప్రమాద బీమా పథకం టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలంలో ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త కాలే రవీందర్ ప్రమాదంలో మృతిచెందగా బాధిత కుటుంబానికి మంజూరైన ప్రమాద బీమా చెక్కు రూ.2 లక్షలను గురువారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు మృతిచెందితే వారి కుటుం బం రోడ్డున పడకుండా బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా, బీమా చెక్కు మంజూరు చేయించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంక న్న, ఎంపీపీ విజేందర్, జున్నుతుల రాంరెడ్డి, కంది కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని జ్యోతిబసునగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యం లో స్థానికులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు నెలరోజుల్లో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దారపు రమేశ్, కన్నం వెంకన్న, మహమ్మద్ జారా సాహెబ్, కొత్తకొండ రాజమౌళి, జన్ను రమేశ్, బండారి మల్లేశ్, కుక్కల యాకయ్య, ఈర్ల రాజు, జన్ను మొగిలి, సందీప్, పుట్టపాక సునీత, గడ్డం స్వరూప, ప్రమీల, యాదగిరి, నిర్మల, ఐలయ్య, అచల పాల్గొన్నారు.
రైతు బీమా చెక్కుల పంపిణీ
నెక్కొండ : మండలంలోని 17 మంది లబ్ధిదారులకు రైతు బీమా చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం నర్సంపేటలో పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షడు సంగని సూరయ్య, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- జనగామ జిల్లాలో సర్పంచ్ సస్పెండ్, మరొకరికి షోకాజ్ నోటీసులు
- సంగారెడ్డిలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు
- సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో పురోగతి
- ప్రసవం తర్వాత కుంకుమ పువ్వు తినడం మంచిదేనా?
- మార్చి 2 నుంచి ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!