బుధవారం 03 మార్చి 2021
Warangal-rural - Jan 21, 2021 , 00:25:28

డ్రమ్‌ సీడర్‌ సాగుతో అధిక ప్రయోజనాలు

డ్రమ్‌ సీడర్‌ సాగుతో అధిక ప్రయోజనాలు

దుగ్గొండి, జనవరి 20 : రైతులు డ్రమ్‌ సీడర్‌ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తే పెట్టుబడి తగ్గి అధిక ప్రయోజనాలు పొందొచ్చని  దుగ్గొండి వ్యవసాయాధికారి చిలువేరు దయాకర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యుగేంధర్‌కు చెందిన పొలంలో ఏవో దయాకర్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు డ్రమ్‌ సీడర్‌ విధానంపై అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ.. డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో నీటి వినియోగం తగ్గి వరి పంట సమంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు విశ్వశాంతి, మధు, రైతులు సురేందర్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

పంటల వివరాలు నమోదు..

మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో యాసంగి పంటల వివరాలను ప్రతి రైతు నమోదు చేయించుకోవాలని ఏవో దయాకర్‌ సూచించారు. నమోదు చేయించుకోకపోతే సంబంధిత పంట ఉత్పత్తులను కొనుగోలు చేయరన్నారు.

చెన్నారావుపేటలో..

చెన్నారావుపేట : రైతులు పంటల వివరాలు అందించాలని మండల వ్యవసాయాధికారి కర్పూరపు అనిల్‌కుమార్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు విధిగా పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు స్మిత, రఘుపతి, వినయ్‌, సంపత్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo