ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 18, 2021 , 04:27:19

క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట

క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట

  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

దుగ్గొండి, జనవరి 17 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామంలో సర్పంచ్‌ సింగబోయిన భాగ్యలక్ష్మి లింగన్న, గ్రామ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్‌ స్థాయి క్రీడాపోటీలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ క్రీడాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఎంతో నైపుణ్యం దాగి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయస్థాయిలో రాణించేందుకు కృషి చేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రూరల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్‌ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, ఎన్నారై రాజ్‌కుమార్‌, దుగ్గొండి ఎస్సై రవికిరణ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ బండి జగన్‌, ముదురుకోళ్ల శారదాకృష్ణ, బొమ్మగాని ఊర్మిళావెంకన్న, లింగంపల్లి ఉమారవీందర్‌రావు, మోడెం విద్యాసాగర్‌గౌడ్‌, మేరుగు రాంబాబు, నిర్వాహకులు సింగనబోయిన రమేశ్‌, మర్రి మురళి, కన్నెబోయిన శరత్‌, జంగం నర్సింహ, మేరుగు రాజు, ఉప సర్పంచ్‌ కొండ్లె సతీశ్‌, మేరుగు లింగయ్య, మల్హల్‌రావు, మర్రి చేరాలు, గాధం అనిల్‌, నర్సయ్య, శ్రీకాంత్‌, రాజు పాల్గొన్నారు.

VIDEOS

logo