ఆదివారం 07 మార్చి 2021
Warangal-rural - Jan 17, 2021 , 02:02:05

వ్యాక్సిన్‌ సురక్షితం.. భయపడొద్దు

వ్యాక్సిన్‌ సురక్షితం.. భయపడొద్దు

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, జనవరి 16 : కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. వ్యాక్సిన్‌ రావడంతో కొంత ఉపశమనం కలిగిందన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. వ్యాక్సినేషన్‌ విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ సంజీవయ్య మొదటి టీకా తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితా రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ విజయ్‌పాల్‌రెడ్డి, ఆర్డీవో కిషన్‌, డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఊరుగొండ జాతరలో ఎమ్మెల్యే పూజలు

దామెర : ఊరుగొండ శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాగా, ప్రధాన అర్చకుడు తూపురాణి శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. సాయంత్రం ఘనంగా పల్లకీసేవ నిర్వహించారు. కార్యక్రమంలో మేకలు, గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్యయాదవ్‌, ఎంపీపీ కాగితాల శంకర్‌, జడ్పీటీసీ కల్పన, వైస్‌ ఎంపీపీ జాకీర్‌అలీ, సర్పంచ్‌లు గోగుల సత్యనారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, యాదా రాజేశ్వరి, రాజేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు రాజు, ఉపసర్పంచ్‌లు విద్యాసాగర్‌, గోల్కొండ సురేందర్‌, మెంతుల రాజు, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ బిల్లా రమణారెడ్డి, కుడా డైరెక్టర్‌ ఎన్కతాళ్ల రవీందర్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ఆరె వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జక్కుల రాణీరవీందర్‌, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo