శనివారం 06 మార్చి 2021
Warangal-rural - Jan 17, 2021 , 02:02:05

కార్యకర్తలను కాపాడుకుంటా

కార్యకర్తలను కాపాడుకుంటా

  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

న్యూశాయంపేట, జనవరి 16 : తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. 32వ డివిజన్‌లో కుడా డైరెక్టర్‌ మాడిశెట్టి శివశంకర్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు వేల్పుల వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో శనివారం  పలువురు పార్టీలో చేరారు. వారికి చీఫ్‌విప్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై అందరూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో న్యూశాయంపేటకు చెందిన వీఆర్‌వన్‌ యూత్‌ నాయకులు బొల్లెన సాయికిరణ్‌, సుమన్‌, సత్తు సిద్ధార్థ్‌, వినయ్‌, లింగాల శార్వణ్‌కుమార్‌, రామకృష్ణ, గోపు క్రాంతి, మోహన్‌, సామల దినేశ్‌, సందీప్‌, ఎర్ర అవినాష్‌బాబు, వెనుకంటి నిఖిల్‌, ఆరెల్లి నిఖిల్‌, మామిడాల రోహిత్‌, వేల్పుల విష్ణు, వరుణ్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గుండు సదానందం, జానకిరాములు, మామిండ్ల సురేశ్‌, మల్యాల రమేశ్‌, కారు ఉపేందర్‌, అదె ఉమేశ్‌, వేల్పుల సందీప్‌, నిఖిల్‌, అభి, సృజన్‌ పాల్గొన్నారు.

పోచమ్మకుంటలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

నయీంనగర్‌ : 2020 సంవత్సరం ఒక పీడకళలాంటిదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. పోచమ్మకుంట యూహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో  సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు ప్రజాప్రతినిధులంతా కలిసి పేదలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనా కష్టకాలంలో వ్యాధిబారిన పడ్డ సుమారు 37వేల మందికి తన వంతుగా నిత్యావసర సరుకులు, కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు సుమారు 2406 టీకా డోసులు వచ్చాయని, వీటిని దశల వారీగా అందిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, డిప్యూటీ మేయర్‌ ఖాజాసీరాజుద్దీన్‌, ఏసీపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్లు కృష్ణారావు, విజయ్‌కుమార్‌, అనితా, అర్చన, శ్రీకాంత్‌, నాయకులు సుందర్‌రాజ్‌, రాచమళ్ల రవీందర్‌, జనార్దన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo