మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jan 14, 2021 , 01:55:15

బ్యాంకు లింకేజీ రుణాల్లో ‘రూరల్‌' టాప్‌

బ్యాంకు లింకేజీ రుణాల్లో ‘రూరల్‌' టాప్‌

  • నిర్దేశిత లక్ష్యం రూ. 323.64 కోట్లు
  • ఇప్పటికే రూ. 275.62 కోట్ల పంపిణీ
  • రూ. 85.16 శాతంతో రాష్ట్రంలో ఫస్ట్‌
  • 8,424 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి
  • అతివల ఆర్థికాభివృద్ధికి దోహదం

వరంగల్‌రూరల్‌, జనవరి 13(నమస్తేతెలంగాణ): బ్యాంకు లింకేజీ రుణాల అందజేతలో వరంగల్‌ రూర ల్‌ జిల్లా రాష్ట్రంలో అగ్రభాగాన ఉంది. నిర్దేశిత లక్ష్యం లో ఇప్పటికే 85.16 శాతం రుణాలు ఇచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఇప్ప టి వరకు జిల్లాలో 8,424 స్వయం సహాయక సంఘా లకు రూ.275.62 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు పం పిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 558 గ్రామైక్య సంఘా ల్లో 13,731 స్వయం సహాయక సంఘాలు పనిచేస్తు న్నాయి. వీటిలో 1,55,121 మంది సభ్యులు ఉన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ రు ణాల పంపిణీకి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 10,735 సంఘాలను గుర్తించింది. వీటికి రూ. 323. 64 కోట్ల రుణాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిం చింది. నూరుశాతం పంపిణీకి గడువు మరో రెండున్న ర నెలలుండగా, ఇప్పటికే జిల్లాలో 85.16 శాతం రు ణాల పంపిణీ చేయడం విశేషం. 78.47 శాతం సం ఘాలకు ఈ రుణాలు అందజేసినట్లు అధికారులు వెల్ల డించారు. కరోనా మహమ్మారితో కష్టాలు తలెత్తిన స మయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3, 888 స్వయం సహాయక సంఘాలకు రూ.20.71 కో ట్ల రుణాలను అధికారులు అందజేశారు. ఆ తర్వాత బ్యాంకు లింకేజీ రుణాలు రూ.254.91 కోట్లు ఇచ్చా రు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8, 424 సంఘాలకు మొత్తం రూ.275.62 కోట్ల రుణా లు పంపిణీ చేశారు. 85.16 శాతంతో బ్యాంకు లింకేజీ రుణాల అందజేతలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం లో నిలిచింది. 82.89 శాతంతో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉంటే 81.90 శాతంతో కామారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉంది. 79.34 శాతంతో జన గామ జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 72.28 శాతం రుణాలు పంపిణీ చేశారు.

అతివలకు అండగా..

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అండ గా ఉంటున్నాయి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుం డా, వడ్డీ భారం పడకుండా బాసటగా నిలుస్తున్నాయి. బ్యాంకు లింకేజీ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న రుణాలు మహిళల వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతున్నా యి. కూరగాయలు, చిన్న చిన్న దుకాణాలు, ఇతర వ్యాపారాలకు మహిళలు ఈ రుణాలను వినియోగిం చుకుంటున్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన డం, ప్రైవేటులోనూ అప్పు లభించని పరిస్థితుల్లో ప్ర భుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపి ణీ లక్ష్యాలను కూడా పెంచింది. 2020-21 కోసం మొదట జిల్లాలో రూ.270 కోట్ల బ్యాంకు లింకేజీ రుణ ప్రణాళికను ఖరారు చేసిన ప్రభుత్వం ఇటీవల దీనిపై ఆదనంగా మరో ఇరవై శాతం అంటే రూ.54 కోట్లు పెంచి రూ.323.64 కోట్ల లక్ష్యం నిర్దేశించింది. 

నెలాఖరులోగా పూర్తిచేస్తాం..

జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా అధిగమిస్తాం. తొ లుత డిసెంబర్‌లోనే పూర్తి చేయాలని అనుకు న్నాం. మొదట ఈ ఆర్థి క సంవత్సరం బ్యాంకు లింకేజీ రుణాల అందజేత టార్గెట్‌ రూ.270 కోట్లు ఉండె. ప్రభుత్వం ఇటీవల మరో ఇరవై శాతం అంటే మరో రూ.54 కోట్లు పెంచింది. దీంతో లక్ష్యం రూ.323.64 కోట్లకు పెరిగింది. తొలుత నిర్దేశించిన రూ.270 కోట్ల బ్యాంకు లింకేజీ రు ణా ల పంపిణీ టార్గెట్‌ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ జనవరి నెలాఖరు లోగా పూర్తి చేస్తం. మహిళల ఆర్థికాభివృ ద్ధికి ఈ రుణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

- ఎం సంపత్‌రావు, డీఆర్డీవోlogo