సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jan 14, 2021 , 01:55:17

ఊరూరా భోగి వేడుకలు

ఊరూరా భోగి వేడుకలు

  • గంగిరెద్దుల విన్యాసాలు
  • ముత్యాల ముగ్గులతో అలరించిన ఆడపడుచులు
  • తెలంగాణ సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాలి
  • జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌

జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో గంగిరెద్దుల విన్యాసాలు కనిపించాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపడుచులు వేసిన ముత్యాల ముగ్గులు ఆకట్టుకున్నాయి. పలు గ్రామాల్లో విద్యార్థినులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

దుగ్గొండి, జనవరి 13: తెలంగాణ సంస్కృతీ సంప్రదాలయాలను భవిష్యత్‌ తరాలకు  అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మందపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తెలంగాణ మహిళా జాగృతి ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్‌ చైర్మన్‌ హాజరై ముగ్గులను తిలకించారు. కార్యక్రమంలో  ఎంపీపీ కాట ్లకోమలాభద్రయ్య, మహిళా జాగృతి జిల్లా అధ్యక్షురాలు సాంబలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, టీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెకారి రంగరావు, సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, హెచ్‌ఎం కర్ణకంటి రామ్మూర్తి, జాగృతి నాయకులు బాలకృష్ణ, శిరీషాశ్రీకాంత్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భోగి పండుగను పురస్కరించుకుని మండలంలోని నాచినపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం, కేశవాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బుధవారం ప్రత్యేక  పూజలు నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే తమ ఇంటి ముంగిళ్లలో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, నవధాన్యాలతో అలంకరించారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేశారు. దీంతో పల్లెలన్నీ సందడిగా మారాయి.

పట్టణంలో భోగి సంబురాలు..

నర్సంపేట: భోగి సందర్భంగా పట్టణంలోని పలు కూడళ్లు, ఇంటి ముంగిళ్లలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేయగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, ఎన్నారై సెల్‌ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్‌, తడిగొప్పుల మల్లేశ్‌, కౌన్సిలర్‌ రాయిడి కీర్తి-దుశ్యంత్‌రెడ్డి, గందె శ్రీలత, జుర్రురాజు, నల్లా భారతి, మండల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ప్రజలు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. అంతేకాకుండా నర్సంపేటలో ఏఐఎఫ్‌డీడబ్ల్యూ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిని, పాకాల మహిళా బ్యాంకు చైర్మన్‌ పెండెం రాజేశ్వరి బొప్పరి హారిక, కాసుల శిరీష,  పుట్టపాక రవళికు బహుమతులు అందించారు. జిల్లా కార్యదర్శి వీ రాగసుధ, కన్నం వెంకన్న, పీ కరుణ, నాగరాజు, యాదగిరి, ప్రసాద్‌, జన్ను జమున, భవాని, పద్మ, తబిత, శారద, పుష్ప, సరోజన పాల్గొన్నారు.

వర్ధన్నపేట: మండలకేంద్రంలోని శివాలయంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. వరుసగా నాగవెల్లి నవ్యకు రూ.1,016, సాయిజ్యోతి రూ.716, తాళ్ల అఖిల రూ. 516, రామగిరి జ్యోతి రూ. 216 నగదు గెలుచుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంసీ ప్రతినిధులు హరినాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, మాడిశెట్టి లక్ష్మణ్‌, సిలువేరు శ్రీధర్‌, తోట శ్రీనివాస్‌, మైస వీరేందర్‌, దేవేంద్రాచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంస్కృతికి ప్రతిబింబాలు ముగ్గులు

శాయంపేట: తెలుగు సంస్కృతికి ప్రతిబింబాలు ముగ్గులు అని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తాటికొండ రవికిరణ్‌, ఉప సర్పంచ్‌ కుక్కల భిక్షపతి అన్నారు.  తహార్‌పూర్‌లో యువ చైతన్య యూత్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వలస పూజిత, బుస్స శిరీష, కుక్కల మంజుల, జంగిలి కల్పనకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యూత్‌ అధ్యక్షుడు కుక్కల నాగరాజు, సభ్యులు కుక్కల ప్రశాంత్‌, వలస తరుణ్‌, జంగిలి వెంకటేశ్‌, బుస్స సాంబరాజు, నిమ్మల ప్రశాంత్‌, కుక్కల రాకేశ్‌, కూతాటి సాంబరాజు, తక్కల అంజి పాల్గొన్నారు. అంతేకాకుండా మండలకేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓ కంపెనీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఐ రమేశ్‌కుమార్‌ హాజరై మాట్లాడుతూ పోలీసులంటే ప్రజల్లో ఎలాంటి భయం వద్దని సూచించారు. వచ్చే ఏడాది స్టేషన్‌ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని సీఐ అన్నారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన మామిడి కల్యాణి, బంక శిరీష, బాసాని సాయిమానసకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కందగట్ల రవి, మాజీ సర్పంచ్‌ బాసాని శాంత, నవోదయ స్కూల్‌ కరస్పాండెంట్‌ మామిడి శరత్‌, గన్ను వేణుగోపాల్‌, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

నెక్కొండ: మహబూబ్‌నాయక్‌తండాలో జీపీ సిబ్బందికి సర్పంచ్‌ మాలోత్‌ పూర్ణ దుస్తులు పంపిణీ చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దుస్తులు అందజేసినట్లు సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మాలోత్‌ హరిలాల్‌ నాయక్‌ పాల్గొన్నారు.

భోగి మంటలు వేసిన ఎంపీపీ

ఖానాపురం: మండలకేంద్రంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు-పద్మ దంపతులు తమ ఇంటి ఆవరణలో భోగి మంటలు వేశారు. ప్రజలకు భోగభాగ్యాలు కలుగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ శ్రీనివాసరావు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ దేవినేని వేణుకృష్ణ, దాసరి రమేశ్‌, వడ్డే రాజశేఖర్‌, వెంకటేశ్‌, మచ్చిక అశోక్‌, రాజు, రామస్వామి తదిత రులు పాల్గొన్నారు.

సంగెం: మండలకేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మనిషిలోని చెడు ఆలోచనలను భోగి మంటల్లో దహనం చేసి మంచి ఆలోచనలకు స్వాగతం పలకడమే భోగి పండుగ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కన్వీనర్‌ కందకట్ల నరహరి, జాగృతి జిల్లా అధ్యక్షుడు యార బాలకృష్ణ, సర్పంచ్‌లు గుండేటి బాబు, కావటి వెంకటయ్య, ఎంపీటీసీ మెట్టుపెల్లి మల్లయ్య, ఉప సర్పంచ్‌ కక్కెర్ల శరత్‌, నాగార్జునశర్మ, జున్న రాజు, సతీశ్‌, చరణ్‌, కిశోర్‌, శ్రీకాంత్‌, గోవర్ధన్‌, రాజశేఖర్‌, సుమన్‌, జక్క సుభాష్‌, పెండ్లి పురుషోత్తం, గోపాల్‌రెడ్డి, అఖిల్‌యాదవ్‌, శంకర్‌, ప్రవీణ్‌, దుడ్డె ప్రశాంత్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నర్సంపేట రూరల్‌: మండలంలోని 27 గ్రామాల్లో భోగి వేడుకలు జరుపుకున్నారు. ఇళ్ల ముంగిళ్లలో మహిళలు ముత్యాల ముగ్గులు వేసి, రంగులు నింపి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముత్తోజిపేట, రాజుపేట, ఇటుకాలపల్లి, ఆకులతండాలో గంగిరెద్దులు సందడి చేశాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది.

పర్వతగిరి: మండలంలోని అన్ని గ్రామాల్లో భోగి సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఇంటి వాకిళ్లలో మహిళలు అందమైన ముగ్గులు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

సంగెం: సంక్రాంతి పర్వదినం సందర్భంగా బుధవారం భోగి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి ముంగిట్లో మహిళలు ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. రకరకాల పిండివంటల తయారీలో మహిళలు బిజీ అయ్యారు.