సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jan 13, 2021 , 00:06:54

ఆదర్శనీయుడు వివేకానందుడు

ఆదర్శనీయుడు వివేకానందుడు

  • యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ 
  • దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు 
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ 
  • అన్నారంలో వివేకానందుడి విగ్రహం ఆవిష్కరణ
  • జాతీయ యువజన దినోత్సవంలో పాల్గొన్నచీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

పర్వతగిరి, జనవరి 12: ఆదర్శనీయుడు స్వామి వివేకానందుడు అని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామంలో మంగళవారం వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువత దృఢ నిశ్చయంతో పనులు చేపడితే సాధించలేనిది లేదన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానందుడు అని కొనియాడారు. ‘సమస్త శక్తులు నీలోనే ఉన్నాయి.. నీవు ఏమనుకుంటే అది సాధించగలవు’ అని వివేకానందుడు సూచించిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. చిన్న వయసులోనే ప్రపంచ దేశాలన్నింటికీ భారతీయ హిందూ ధర్మంపై ప్రాచుర్యాన్ని కల్పించాడని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ బానోత్‌ సింగ్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌గౌడ్‌, మార్కెట్‌ డైరెక్టర్లు పల్లెపాటి శాంతిరతన్‌రావు, పట్టపురం ఏకాంతంగౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌, సర్పంచ్‌ యశోద, మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్రె దేవేందర్‌, షబ్బీర్‌అలీ, మధు, చేబెల్లి మహేందర్‌, చిదురాల వేణు, మునుకుంట్ల బాబు, జడల కృష్ణ, యాకయ్య, గొల్లపెల్లి మహేందర్‌, స్వామి వివేకానంద యూత్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. 

యువతకు స్ఫూర్తి వివేకానందుడు

వరంగల్‌ చౌరస్తా, జనవరి12 : యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుం డా ప్రకాశ్‌రావు, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. మంగళవారం 26వ డివిజన్‌ పాపయ్యపేట చమన్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. చిన్న వయస్సులోనే భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా విస్తరింపజేసిన వారిలో వివేకానందుడు ఒకరన్నారు. అనంత రం రాయబారపు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నరేందర్‌ ప్రారంభించా రు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలారపు కృష్ణమూర్తి, యెల్లోసా, జయసేన, చిట్టిరెడ్డి, నర్సింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ప్రజా సంక్షేమ ప్రభుత్వం : చీఫ్‌ విప్‌ దాస్యం

న్యూశాయంపేట, జనవరి 12 : ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రపేరుతో చేపట్టిన డివిజన్ల పర్యటనకు అనూహ్య స్పందన లభిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా హన్మకొండ రెవెన్యూకాలనీ కమ్యూనిటీ హాలులో 26 మం ది లబ్ధిదారులకు మంజూరైన రూ.10,90,500 విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికే దిక్సూచీగా తెలంగాణ రాష్ట్రం అన్నారు. ప్రజా, కార్యకర్తల సంక్షేమం కోసం ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న 25 మంది యువతీ యువకులను సన్మానించారు.


logo