శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 13, 2021 , 00:06:56

వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి

వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి

  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 
  • పలు శాఖల అధికారులతో సమీక్ష 

నర్సంపేట, జనవరి 12 : కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రెవెన్యూ, పోలీసు, మెడికల్‌, మున్సిపాలిటీ, విద్యుత్‌ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. జనవరి 16 నుంచి 22వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ ఉంటుందన్నా రు. డివిజన్‌ వ్యాప్తంగా 1806 మందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. నర్సంపేట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌తో పాటు తొమ్మిది పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ఉంటుందన్నారు. మొదటి దశ తర్వాత 28 రోజులకు రెండో దశ ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మపర్సన్‌ గుంటి రజనీకిషన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, సీఐ కరుణసాగర్‌రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌, పీహెచ్‌సీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వీడియో సాంగ్‌ విడుదల

చెన్నకేశ్వరస్వామి ఆలయ విశిష్టతపై చిత్రీకరించిన వీడియో సాంగ్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో ఉన్న చెన్నకేశ్వరస్వామి జాతర  విశిష్టతపై ఇదే గ్రామానికి చెందిన మాదారపు శ్రీనివాస్‌ రచించిన పాటను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో లింగగిరి ఎంపీటీసీ లక్ష్మీరాజన్ననాయక్‌, గ్రామ అధ్యక్షుడు మేడబోయిన కుమారస్వామి, వీడియో మిక్సింగ్‌ యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం

వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యా లయంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


logo