‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోవాలి

- నర్సరీల సంరక్షణపై శ్రద్ధ చూపాలి
- ప్రజావేదికలో డీఆర్డీవో సంపత్‌రావు
దామెర, జనవరి 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో సంపత్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఉపాధిహామీ పనులపై మంగళవారం చేపట్టిన మొదటి విడుత సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కూలీ డబ్బులు సక్రమంగాచెల్లించక పోవడం, హరితహారంలో నాటిన మొక్కలు ఆ ప్రదేశంలో లేకపోవడం, ఇంకుడు గుంతలు తీయకున్నా బిల్లులు చెల్లించడం, గుంతలు తీసిన వాటిని పూడ్చివేసినట్లు తనిఖీ బృందం సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. మస్టర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే ఉపాధి కూలీలతో నాటించాలని సూచించారు. ఈనెల 25వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజావేదికలో డీవీవో పద్మనాభరెడ్డి, జడ్పీటీసీ కల్పన, ఎంపీపీ కాగితాల శంకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు,ఎంపీఓ యాదగిరి, ఎస్ఆర్పీ జాన్సీ, ఏపీవో శారద, సర్పంచ్‌లు కుక్కశ్రావణ్య, రజిత, విష్ణువర్ధన్ రెడ్డి, పున్నం రజిత, గోవిందు అశోక్, మేడిపల్లి సాంబయ్య, గోగుల సత్యనారాయణరెడ్డి, యాదా రాజేశ్వరి, శ్రీనివాస్, వడ్డెపల్లి శ్రీనివాస్, కేతిపల్లి సరోజన, శ్రీరాంరెడ్డి, పుల్యాల రాణి, బింగి రాజేందర్, డీఆర్పీలు గణేశ్, నరేశ్, దేవేందర్, ప్రియాంక, కల్యాణి, బాబు, రాము, టీఏ సురేందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి