మహిళలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు

నర్సంపేట/సంగెం/నెక్కొండ, జనవరి 12: పలు గ్రామాల్లో మంగళవారం మహిళలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఐఎంఏ నర్సంపేట శాఖ ఆధ్వర్యంలో ఐఏంఎ హాలులో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలను ఐఎంఏ పట్టణ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి పరిశీలించారు. మహిళా వైద్యులు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐఎంఐ కార్యదర్శి డాక్టర్ జాన్సన్, నర్సంపేట ఏసీపీ సతీమణి అరుణ, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, కోశాధికారి డాక్టర్ కిషన్, డాక్టర్ భారతి పాల్గొన్నారు. అలాగే, సంగెం మండలం మొండ్రాయి జడ్పీఎస్‌ఎస్‌లో తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి ఇన్చార్జి హెచ్ఎం కృష్ణ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిని నర్మద, ద్వితీయ బహుమతిని అక్షయ గెలుచుకున్నారు. కార్యక్రమంలో తరుణి స్వచ్ఛంద సంస్థ మొండ్రాయి క్లస్టర్ కోఆర్డినేటర్ పెండ్లి మౌనిక, వలంటీర్ బీ రమ్యశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెక్కొండ మండలంలోని పత్తిపాకలో సర్పంచ్ లావుడ్య సరిత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు విజేతలకు బహుమతులు అందించారు. కార్యదర్శి రాకేశ్, లావుడ్య తిరమల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అన్నదాతకు కన్నీరు రాకుండా చూస్తున్న సీఎం కేసీఆర్
- బైడెన్ ఫస్ట్ డే.. డబ్ల్యూహెచ్‌వోలో చేరనున్న అమెరికా
- మాస్క్ ధరించని విదేశీయులతో పుష్ అప్స్
- ‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత లీగల్ నోటీసులు
- కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
- రోడ్డు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్
- సారీ చెప్పిన సల్మాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్
- ఆస్వాదించు..ఆనందించు
- ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి
- క్వారంటైన్లో ప్లేయర్స్.. 4 కోట్ల డాలర్ల ఖర్చు!