బాల్య వివాహాలను నిర్మూలించాలి

- పిల్లలు పోషకాహారం తీసుకోవాలి
- నిబంధనల మేరకే వివాహాలు చేయాలి
- జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి
నర్సంపేట, జనవరి 11: బాల్య వివాహాలను నిర్మూలించాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి జీ మహేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కౌమారదశలో వచ్చే మార్పులపై లఘు చిత్రాలు చూడాలని పిల్లలకు సూచించారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున పోషకాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. బాల్య వివాహాల వల్ల అనారోగ్యాలకు గురవుతారన్నారు.
బాల్య వివాహాలు చేస్తే సమాచారమివ్వాలి
బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెండ్లిళ్లు చేయాలని మహేందర్‌రెడ్డి కోరారు. ఎక్కడైనా బాల్య వివాహలు జరిగితే వెంటనే 1098కి సమాచారం అందించాలని సూచించారు. ఆశ్రమ నిర్వాహకుడు డాక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నారు. బాలబాలికలు ఓ లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు శ్రమించాలన్నారు. బాలల సంరక్షణాధికారి రాజు మాట్లాడుతూ అపరిచితులపై బాలబాలికలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో నర్సింహస్వామి, పద్మలత, వినోద తదితరులు పాల్గొన్నారు.
భ్రూణ హత్యలు ఆపాలి
భ్రూణ హత్యలను ఆపాలని చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ వీరబాబు అన్నారు. నర్సంపేటలోని సఖీ సెంటర్లో ఐసీడీఎస్, వైద్య, సఖీ కేంద్రం సిబ్బందికి ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1098 సేవలను 24 గంటలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా బాలికలు, మహిళలు సమాచారం అందించాలని కోరారు. ఎక్కడైనా బాల కార్మికులు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జి శ్రీలత మాట్లాడుతూ వరకట్నం, గృహహింస లాంటి వేధింపులు ఉంటే సఖీ సెంటర్ సేవలను 24 గంటలపాటు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రమేశ్‌నాయక్, నిర్మలామేరీ, హరీశ్, తిరుపతి, నాగరాజు, మమత, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, సరస్వతి, పారిజాతం, వాసంతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు