సంక్షోభంలోనూ సంక్షేమం

- నిధులు, నీళ్లు, నియామకాల్లో తెలంగాణే అగ్రగామి
- రెండు నెలల్లో భారీగా ఉద్యోగ నియామకాలు
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది
- దుగ్గొండి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేటలో సన్నాహక సమావేశాలు
- నిధులు, నీళ్లు, నియామకాల్లో తెలంగాణే అగ్రగామి
- రెండు నెలల్లో భారీగా ఉద్యోగ నియామకాలు
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది
- దుగ్గొండి, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు
నర్సం పేట రూరల్, జనవరి 10 : సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశామని, నిధులు, నీళ్లు, నియామకాల్లో దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామి గా నిలిపారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుగ్గొండి మండలం గిర్నిబావిలోని కనిష్క ఫంక్షన్‌హాల్, నెక్కొండలోని సు మంగళి ఫంక్షన్ హాల్, ఖానాపురంలో, నర్సంపేట మండలంలోని ముత్తోజీపేట శివారులోని సత్యం ఫంక్షన్హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. త్యా గాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఆరు సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుకునేందుకు సీఎం అనేక ప్రాజెక్టులను నిర్మించారన్నారు. కేంద్రం సహకరించకున్నా గోదావరి, కృష్ణా బేసిన్లో మన వాటా సాధించుకున్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.24 లక్షలు ఉంటే భారతదేశ తలసరి ఆదాయం రూ. 1.34 లక్షలు మాత్రమే ఉందన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఇరిగేషన్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఖర్చు చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడ్డ తెలంగాణలో నేటి వరకు లక్షా యాభై వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేసినట్లు తెలిపా రు. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పె డుతున్న మత తత్వ పార్టీలకు గుణపాఠంలా ఉండేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు. గతంలో పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహించి విజయం సాధించామన్నా రు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఇన్చార్జి శానబోయిన రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ సల్లాటి జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, గుండెకారి రంగారావు, శ్రీనివాస్‌రెడ్డి, రాంబాబు, నీలం పైడయ్య, సురేందర్‌రెడ్డి, సాంబలక్ష్మి, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన, ఎమ్మెల్సీ మం డల ఇన్చార్జి, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూర య్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్నభీ, సొసైటీ చైర్మన్లు జలగం సంపత్‌రావు, దామోదర్‌రెడ్డి, మండల నాయకుడు చెన్నకేశవరెడ్డి, సర్పంచ్‌లు ఆలకుంట సురేందర్, భోంపెల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతుబంధు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి షేక్ మస్తాన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాస ప్రవీణ్‌కుమార్, ఎం పీటీసీ భారతి, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు
- అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్ సీఈవో
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు