శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 11, 2021 , 00:47:24

ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం

ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌
  • హన్మకొండలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం 

న్యూశాయంపేట, జనవరి 10: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటుందని వర్ధ న్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  అన్నా రు. హంటర్‌ రోడ్డులో నూతనం గా ఏర్పాటు చేసిన హన్మకొండ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రతి మండలం లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

కేజీబీవీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 

జిల్లా కమిటీ ఎన్నిక

కమలాపూర్‌, జనవరి 10 : కేజీబీవీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారి చేరాల అర్చన ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా రజిత, శిరీష, జనరల్‌ సెక్రటరీగా సునీత, జాయిం ట్‌ సెక్రటరీగా రాధిక, కోశాధికారిగా అనురాధ, ఆడిట్‌ కమిటీ సభ్యురాలిగా స్వప్న ఎన్నికయ్యారు. జిల్లాలోని కేజీబీవీలకు చెందిన ఉద్యోగులు తొలిసారిగా కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు.