రూ.5 కోట్లతో మొగిలిచర్ల అభివృద్ధి

- పోగుల ఆగయ్యనగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇస్తాం
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- రెండో డివిజన్లో పర్యటన
గీసుగొండ, జనవరి 9 : గ్రేటర్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామాన్ని రూ.5కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రెండో డివిజన్లోని మొగిలిచర్ల గ్రామంతో పాటు పోగుల ఆగయ్యనగర్, గోపాల్‌రెడ్డి నగర్లో అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొగిలిచర్ల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటిక నిర్మాణాలకు గ్రేటర్ నుంచి ఇప్పటికే రూ.2.40 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో రూ.2.60 కోట్ల నిధులతో చేపట్టే పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనులను పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామంలో రోడ్లు విస్తరించుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోగుల ఆగయ్య నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు అందిస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరేటర్ ల్యాదెళ్ల బాలయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గజ్జిరాజు, సొసైటీ చైర్మన్ దొంగల రమేశ్, నాయకులు బెజ్జల చిన్న వెంకటేశ్వర్లు, శ్రావణ్, కిశోర్, రిషి, రవికుమార్, అంజయ్య, అనిల్, మనోహర్, కళాధర్, రవి, సంపత్, ఉజ్వల్, రఘు, ఏఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్‌లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్