ఉగాది నుంచి ఉచిత తాగునీరు

- రూ.500 కోట్లతో నగరాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
- అర్హులైన మహిళా సంఘాలకు రూ.3లక్షల వడ్డీ లేని రుణం
- కాంగ్రెస్, బీజేపీ నాయకులు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నరు
- మేం వాళ్లకు కాదు...ప్రజలకు సమాధానం చెప్తాం
- ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో మంత్రి దయాకర్‌రావు
మట్టెవాడ, జనవరి 8 : ‘ఉగాది నుంచి శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తాం. అర్హులైన వారికి ఉచితంగా అందిస్తాం. రూ.500కోట్లతో నగరాభివృద్ధికి ప్రణాళిలు సిద్ధం చేశాం. అర్హులైన మహిళా గ్రూపులకు రూ.3లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తాం. ప్రజల కష్టాలు తెలిసిన వాళ్లం... ప్రజల వెంట ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 24వ డివిజన్లోని ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రం లో స్థానిక కార్పొరేటర్ గుండు అశ్రితావిజయ్ రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరదలు వచ్చిన సమయంలో ప్రజ ల వెంట ఉండి వారికి అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఎంజీఎం దవాఖానలో చేరిన రోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఎవరో చెబితే వినే పరిస్థితిలో తాము లేమన్నారు. బీజేపీ వాళ్లు పాలించే రాష్టాల్లో కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో రాని ఆ పార్టీ నాయకులు ఇప్పు డు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వరంగల్ జిల్లా తెలంగాణకు గడ్డ, కేసీఆర్ అడ్డ, ఉద్యమాల గడ్డ అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎవరో లొట్టం, గొట్టం గాళ్లు వచ్చి మాట్లాడితే తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలే తమ ఆరాధ్యులన్నారు. 24వ డివిజన్లో రూ.150కోట్లతో అభివృద్ద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అర్హులైన మహిళా సంఘాలకు రూ.3లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. నగరానికి ఓట్ల దొంగలు వస్తున్నారు, వారిని మీరు ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో గుడులు, గ్రంథాల గురించి మాట్లాడితే మాకు అన్ని కావాలని సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలని మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు. 27వ డివిజన్లో కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్ ఆధ్వర్యంలో సుమారు రూ.2కోట్ల వ్యయంలో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులను దాస్యం ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ అహ్మద్, కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న, బోడ డిన్నా, టీఆర్ఎస్ నాయకులు జనార్దన్, పూజారి కుమారస్వామి, కొడకండ్ల సదాంత్, గుండు శ్రీనివాస్, వాడిక నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్
- సముద్రాలను భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
- వలసదారుల కోసం బిల్లు రూపొందించిన బైడెన్..!
- సీఎం కేసీఆర్‌ను విమర్శించొద్దని అప్పుడే నిర్ణయించుకున్న : మంత్రి ఎర్రబెల్లి
- వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి